అక్షరటుడే, మెదక్ : farmer death | మెదక్ (Medak) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పాటుతో రైతు మృతి చెందాడు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట.. అకాల వర్షానికి తడిసి పోతుందని భావించిన ఆ రైతు కాపాడుకోవడానికి వెళ్లాడు. వడ్ల కుప్పపై టార్పాలిన్లు కప్పుతుండగా.. పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన హవేలి ఘనపూర్ (Haveli Ghanpur) మండలం బూర్గుపల్లిలో చోటు చేసుకుంది.
farmer death | టార్పాలిన్ కప్పడానికి వెళ్లగా..
బూర్గుపల్లి గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తనకున్న వ్యవసాయ భూమితో పాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల పొలం కోసి వడ్లు ఆరబోశాడు. అయితే గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం పడటంతో ధాన్యం కుప్పపై టార్పాలిన్ కప్పడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పిడుగు పడటంతో వడ్ల కుప్పపై పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
దీనిని కూడా చదవండి : RTC Strike | తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. ఆర్టీసీ కార్మికులకు సీఎం విజ్ఞప్తి


[…] ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా(medak) కొల్చారం వద్ద మంగళవారం ఈ ఘటన చోటు […]