Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Harish Rao Revanth Reddy | హిట్లర్​కు పట్టిన గతే సీఎం రేవంత్​కు పడుతుంది : హరీశ్​రావు

హిట్లర్​కు పట్టిన గతే సీఎం రేవంత్​రెడ్డికి పడుతుందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఆయన మాట్లాడారు.

Srinivas Kolluri
Last updated: June 7, 2026, 6:54 pm 6:54 pm
Srinivas Kolluri
Share
Harish Rao Revanth Reddy

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Revanth Reddy | నియంత హిట్లర్​కు పట్టిన గతే సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)కి పడుతుందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

హిట్లర్​ను స్ఫూర్తిగా తీసుకొని హైడ్రా పెట్టిన అని రేవంత్ రెడ్డి అనడం ఆయన అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు. నాడు హిట్లర్ పేదలను ఊచకోత కోస్తే, నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తూ వారి బతుకులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్ దురాగతాలకు నేటికీ జర్మనీ క్షమాపణలు చెబుతున్నట్లే, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పాపాలకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు క్షమాపణలు చెప్పక తప్పదని హెచ్చరించారు.

Harish Rao Revanth Reddy | కాంగ్రెస్​ గెలవదు

రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత, కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి అన్నారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. వడ్లు అమ్ముకోవడానికి రైతులు 45 రోజుల పాటు కల్లాల వద్ద పడిగాపులు కాశారని, నేటికీ 30శాతం వడ్లు కల్లాల్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

Harish Rao Revanth Reddy | రైతు బంధుకు ఎగనామం

రైతుల మీద ప్రేమతో కేసీఆర్ రైతుబంధు తీసుకువచ్చారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాసంగి పంటకు రైతుబంధు ఎగనామం పెట్టిందని హరీశ్​రావు విమర్శించారు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా ఎల్ఐసీకి ప్రీమియం కట్టకపోవడంతో రాష్ట్రంలో 3 వేల మంది రైతులు చనిపోయినా రైతు బీమా రావడం లేదన్నారు.

Harish Rao Revanth Reddy | వారిని చేర్చుకోం

brs 3

కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిన వారిని మళ్లీ తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని హరీశ్​రావు అన్నారు. ఈ క్లిష్ట సమయంలో అండగా నిలబడ్డ కార్యకర్తలే తమకు దేవుళ్లని, వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపేలా నాయకులందరూ విభేదాలు పక్కనపెట్టి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

Harish Rao Revanth Reddy | అడ్డుకున్న పోలీసులు

సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొనేందుకు రామగుండం చేరుకున్న హరీశ్​రావును పోలీసులు అడ్డుకున్నారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బీఆర్ఎస్​ నాయకులు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసు అధికారుల తీరుతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.

 

సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొనేందుకు రామగుండం చేరుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.

రామగుండంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లిన హరీశ్ రావు గారు మరియు బీఆర్ఎస్ బృందం.

మాజీ మంత్రి… pic.twitter.com/pkSmL24Iuk

— Office of Harish Rao (@HarishRaoOffice) June 7, 2026


దీనిని కూడా చదవండి : Vaikunthanath Behera Assets | రూ.6 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభం.. రూ.వందల కోట్ల ఆస్తులు

TAGGED:BRScongress governmentHarish RaoHYDRAAKCRPeddapalli NewsRevanth ReddyTelangana Politics
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Alumni Reunion | Alumni Reunion | 16 ఏళ్ల తర్వాత కలిసిన ‘నలంద’ మిత్రబృందం
Next Article Tamil Nadu Politics Tamil Nadu Politics | టీవీకే ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?: స్టాలిన్ హాట్ కామెంట్స్
2 Comments
  • Pingback: Tamil Nadu Politics | టీవీకే ప్రభుత్వం మూడు నెలలైనా
  • Pingback: Cyber Fraud | ‘ఆర్టీఏ చలాన్​’ లింక్​ను క్లిక్​చేసిన యువకుడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

FBO Caught by ACB
తెలంగాణ

FBO Caught by ACB | పోడు భూమి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్​ ఆఫీసర్​

By Shashi kiran Mottala
Future City Cancellation
తెలంగాణ

Future City Cancellation | ఫ్యూచర్​ సిటీ రద్దు చేస్తాం.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

By Balla Sandeep Kumar
Nadendla Bhaskara Rao
ఆంధ్రప్రదేశ్​తెలంగాణ

Nadendla Bhaskara Rao | మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

By Srinivas Kolluri
ACB Trap
తెలంగాణ

ACB Trap | భూ సర్వే చేసినందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.