Dharamshala paragliding accident | 2700 మీటర్ల ఎత్తు నుంచి కుప్పకూలిన పారాగ్లైడింగ్..టూరిస్ట్‌ దుర్మరణం

గాయపడిన స్టీఫెన్ ఆంటోనీకి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dharamshala paragliding accident | హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల Dharmashala సమీపంలో చోటుచేసుకున్న పారాగ్లైడింగ్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో బల్గేరియాకు చెందిన ఒక పర్యాటకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

Dharamshala paragliding accident | బల్గేరియన్ పౌరుడు..

మృతుడిని బల్గేరియన్ పౌరుడైన మాక్సిమ్ వాలెంటినోవిచ్ గావ్రిలిచెంకోగా అధికారులు ధ్రువీకరించారు. ఆయన అక్టోబర్ 7న టూరిస్ట్ వీసాపై భారతదేశానికి వచ్చారు. గాయపడిన మరో పర్యాటకుడిని కూడా అదే దేశానికి చెందిన స్టీఫెన్ ఆంటోనీగా గుర్తించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

ప్రసిద్ధ పారాగ్లైడింగ్ ప్రాంతమైన బిర్ బిల్లింగ్ నుంచి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో వీరిద్దరూ ‘సోలో పారాగ్లైడింగ్’ ప్రారంభించారు. అయితే, ఖనైరా సమీపంలోని ‘రైజింగ్ స్టార్ పీక్’ వద్ద సుమారు 2,700 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఈదురుగాలులు వీచాయి. దీంతో గావ్రిలిచెంకో అదుపుతప్పి వేగంగా నేలను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించగా, స్టీఫెన్ ఆంటోనీ గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు.

Dharamshala paragliding accident | రాత్రంతా సాగిన రెస్క్యూ ఆపరేషన్..

సమాచారం అందుకున్న జిల్లా విపత్తు నిర్వహణ బృందాలు (DDMA), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) మరియు ఇతర సహాయక వర్గాలు ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాయి. కఠినమైన పర్వత ప్రాంతం, మసక వెలుతురు, కమ్యూనికేషన్ ఇబ్బందులు ఉన్నప్పటికీ రాత్రంతా శ్రమించి బాధితుల కచ్చితమైన స్థానాన్ని గుర్తించారు.

సోమవారం ఉదయం 10 గంటల కల్లా ఆపరేషన్ ముగించి, గాయపడిన స్టీఫెన్ ఆంటోనీకి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *