నల్గొండTravel Bus Fire | ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

Travel Bus Fire | ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

ఓ ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Travel Bus Fire | ఓ ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు కాలి బూడిద అయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District)లో చోటు చేసుకుంది. డ్రైవర్​ అప్రమత్తతో ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు.

ఓ ప్రైవేట్ ట్రావెల్స్​కు చెందిన స్లీపర్​ బస్సు హైదరాబాద్​ నుంచి కాకినాడకు బయలుదేరింది. అందులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం (Chityala Mandal) పెద్ద కాపర్తి గ్రామ సమీపంలోకి రాగానే బస్సులో మంటలు చేలరేగాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

Travel Bus Fire | డ్రైవర్ స్పందించడంతో..

Travel Bus Fire

బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్​, క్లీనర్​ వెంటనే అప్రమత్తం అయ్యారు. బస్సును పక్కన నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానిక వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే బస్సుతో పాటు ప్రయాణికుల లగ్గేజీ పూర్తిగా కాలిపోయింది.

Travel Bus Fire | షార్ట్​ సర్క్యూట్​తో..

Travel Bus Fire

ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్​ సర్క్యూట్​ (Short Circuit)తో ప్రాదం జరిగినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్​ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై బస్సు కాలిపోవడంతో కాసేపు ట్రాఫిక్​ జామ్ అయింది.
సంఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Murugan Temple | మంత్రిని లంచం అడిగిన అర్చకులు.. ఎక్కడో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Murugan Temple | దేశంలో బడి నుంచి గుడి...

Muski Lake Protection | ముష్కి చెరువు పరిరక్షణకు చర్యలు.. కంచె వేస్తున్న హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Muski Lake Protection | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని...

Marriage Fraud | యువకుడి ఇంటి ఎదుట యువతి ధర్నా.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపణ..

అక్షరటుడే, బోధన్​: Marriage Fraud | పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి...

Tejaswini Dance Video | నందమూరి అభిమానులను ఫిదా చేస్తున్న తేజస్విని.. డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tejaswini Dance Video | తెలుగు చిత్రసీమలో నందమూరి...