అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ కేసులో న్యాయస్థానం ఒకరికి జైలుశిక్ష విధించింది. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు (Nizamabad Rural Police) వివరాలు వెల్లడించారు.
Drunk Driving Case | నిజామాబాద్ రూరల్ పరిధిలో..
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈనెల 2న మండల పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. పడగల్కు చెందిన జంపన్న మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా గుర్తించారు. అతడికి కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టారు. విచారించిన న్యాయమూర్తి అతడికి ఐదురోజుల సాధారణ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్వో మాట్లాడుతూ..మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) పాటించి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Chandipura Virus | గుజరాత్లో వేగంగా విజృంభిస్తున్న చండీపురా వైరస్.. 22 మంది చిన్నారులు మృతి