అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stockmarket in green | భారత స్టాక్ మార్కెట్ బుధవారం కోలుకుంది. బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ రంగాలలో రుణ వృద్ధి బలంగా ఉండడం, రాబోయే త్రైమాసికాల్లో కూడా ఇది కొనసాగుతుందని అంచనా వేయడంతో మదుపరులు ఆయా రంగాలలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. బలపడిన డాలర్ మరియు భారతీయ ఐటీ కంపెనీలు తమ ఏఐ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటాయనే అంచనాల నేపథ్యంలో ఐటీ స్టాక్స్ సైతం రాణించాయి. ప్రధానంగా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పరుగులు తీశాయి.
Stockmarket in green | ఫ్లాట్‌గా ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 29 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 108 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో కోలుకుని 1,069 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 6 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 301 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్ 790 పాయింట్ల లాభంతో 76,991 వద్ద, నిఫ్టీ 197 పాయింట్ల లాభంతో 24,021 వద్ద స్థిరపడ్డాయి.
Stockmarket in green | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,215 కంపెనీలు లాభపడగా 2,034 స్టాక్స్ నష్టపోయాయి. 181 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 147 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 63 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Stockmarket in green | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 23 స్టాక్ లాభపడగా.. 7 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇండిగో 4.72 శాతం, ట్రెంట్ 3.61 శాతం, టెక్ మహీంద్రా 3.25 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.96 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.69 శాతం లాభపడ్డాయి.
Stockmarket in green | Top losers..
ఎన్టీపీసీ 2.11 శాతం, టాటా స్టీల్ 1.81 శాతం, మారుతి 1.60 శాతం, బీఈఎల్ 1.48 శాతం, ఎయిర్‌టెల్ 1.27 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: RBI Interest Rates | వడ్డీ రేట్ల పెంపు లేదు.. ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన