అక్షరటుడే, వెబ్‌డెస్క్: May 20 Market Analysis | ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతను అనుసరించి భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధం War కారణంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈక్విటీ మార్కెట్‌లో రిస్క్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్న ఇన్వెస్టర్లు బాండ్ ఈల్డ్స్ పై దృష్టి సారిస్తున్నారు.
దీంతో ఆయా దేశాల బాండ్ ఈల్డ్స్ కు భారీ డిమాండ్ ఏర్పడి అధిక స్థాయిలలో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెజరీ ఈల్డ్స్ పెరగడంతో అమెరికా స్టాక్ మార్కెట్ గత సెషన్‌లో క్షీణించింది. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు అన్నీ నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
May 20 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ పడిపోయాయి. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.87 శాతం, ఎస్ అండ్ పీ 0.67 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ ఫ్లాట్ గా ఉంది.
May 20 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.38 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.07 శాతం లాభపడగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.07 శాతం నష్టపోయింది.
May 20 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.29 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.29 శాతం లాభాలతÃ ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ 1.30 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.72 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.57 శాతం
చైనాకు చెందిన షాంఘై 0.40 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.44 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు 3 సెషన్ల తర్వాత నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,457 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు రెండో సెషన్‌లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,801 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.24 నుంచి 1.10కు తగ్గింది.
- విక్స్ 4.87 శాతం తగ్గి 18.67 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 110.95 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలహీనపడి 96.52 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.36 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.67 వద్ద ఉన్నాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాలు వడ్డీ రేట్ల పెంపుపై ఆశలు రేకెత్తించడంతో అమెరికా ట్రెజరీ యొక్క అత్యంత దీర్ఘకాలిక బాండ్ల రాబడులు దాదాపు రెండు దశాబ్దాలలో గరిష్ట స్థాయికి చేరాయి.
30 ఏళ్ల ట్రెజరీ బాండ్ రాబడి ఏడు బేసిస్ పాయింట్ల వరకు పెరిగి 5.20 శాతానికి చేరుకుంది. ఈ స్థాయి చివరిసారిగా 2007 ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు కనిపించింది. అప్పట్లో ఇది 5.18 శాతంగా ఉంది.


