Siddipet Couple Suicide|సిద్దిపేటలో విషాదం.. పెళ్లైన నెలకే నవ దంపతుల ఆత్మహత్య

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Siddipet Couple Suicide|ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట నూరేళ్లు కలిసి ఉంటారని అందరూ భావించారు. కానీ, పెళ్లైన నెల రోజులు కూడా గడవకముందే అనుమానం అనే పెనుభూతం వారి పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. భార్య మనస్తాపంతో తనువు చాలిస్తే.. ఆ బాధను తట్టుకోలేక, భయం తోడై భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో ఆదివారం వెలుగుచూసింది.

Siddipet Couple Suicide|ప్రేమ వివాహం..

కొండపాకకు చెందిన లహరి (21), కొమురవెల్లికి చెందిన వినయ్ (23) గత ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో గత నెల (ఏప్రిల్) 9వ తేదీన అట్టహాసంగా వివాహం జరిగింది. ఉపాధి కోసం ఈ కొత్త దంపతులు 15 రోజుల క్రితమే హైదరాబాద్‌కు వెళ్లారు.

Siddipet Couple Suicide|అనుమానమే శాపమై..

హైదరాబాద్ వెళ్ళిన కొద్దిరోజులకే లహరి ప్రవర్తనపై వినయ్‌కు అనుమానం మొదలైంది. ఆమె వేరొకరితో ఫోన్‌లో మాట్లాడుతోందని భావించిన వినయ్, తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం (మే 7న) భార్యకు కడుపునొప్పిగా ఉందని సాకు చెప్పి, ఆమెను కొండపాకలోని పుట్టింటి వద్ద వదిలి వినయ్ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు.

Siddipet Couple Suicide|గంటల వ్యవధిలోనే ఇద్దరూ..

భర్త తనను అనుమానిస్తున్నాడన్న బాధతో లహరి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త తెలిసిన వినయ్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి బైక్‌పై బయలుదేరాడు. భార్య మరణానికి తానే కారణమన్న అపరాధ భావం, పోలీసు కేసుల భయం వినయ్‌ను వెంటాడాయి. ఈ క్రమంలోనే గజ్వేల్ మండలం కొడకండ్ల శివారుకు చేరుకున్న ఆయన.. తన ఆఖరి లొకేషన్‌ను కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు. అనంతరం అక్కడే ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.”

Siddipet Couple Suicide|గ్రామాల్లో మిన్నంటిన రోదనలు..

పెళ్లైన నెల రోజులకే నవ దంపతులు మృతి చెందడంతో కొండపాక, కొమురవెల్లి గ్రామాల్లో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay Comments | నా మీద కుట్ర పన్నారు.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *