Telangana Weather | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Weather | రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు భగభగ మండిన భానుడు కాస్తా శాంతించాడు. దీంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. నేటి నుంచి తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Telangana Weather

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ (Hyderabad)నగరంలో చెదురుమొదురు వానలు పడే ఛాన్స్​ ఉంది. రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే సాయంత్రం నుంచి రాత్రి వరకు రుతుపవనాలకు ముందు వచ్చే ఉరుములతో కూడిన వర్షాలు పెరుగుతాయని పేర్కొంది.

Telangana Weather |సాగు పనుల్లో రైతులు

Telangana Weather

వానాకాలం సాగు పనుల్లో రైతులు బిజీ అయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలతో దుక్కులు దున్నుతున్నారు. పలు చోట్ల తుకాలు కూడా పోస్తున్నారు. వానాకాలం సాగు పనులు మొదలైనా ఇంకా యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ప్రారంభం అవుతాయని అధికారులు చెబుతుండటంతో వడ్లు తడిసి మొలకొస్తాయని, కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: CMRF Transgender Healthcare | చరిత్రలో తొలిసారి: ట్రాన్స్‌జెండర్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీకి సీఎంఆర్ఎఫ్ సాయం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *