TDP Mahanadu Donations | మహానాడులో కాసుల వర్షం.. తొలి రోజే టీడీపీకి రూ.12.44 కోట్ల విరాళాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TDP Mahanadu Donations | తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మహానాడు కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది వేలాది మంది కార్యకర్తల సమక్షంలో వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈసారి ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు.

ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మహానాడు వర్చువల్గా నిర్వహిస్తున్నప్పటికీ.. పార్టీ నేతలు, కార్యకర్తల ఉత్సాహంలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించలేదు.రెండు రోజుల పాటు జరగనున్న మహానాడు కార్యక్రమం తొలి రోజే భారీ విరాళాలతో హాట్ టాపిక్‌గా మారింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో పార్టీకి మొత్తం రూ.12.44 కోట్ల విరాళాలు అందినట్లు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధికారికంగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో నేతలు, ప్రజాప్రతినిధులు పోటీ పడి మరీ విరాళాలు ప్రకటించారు.

TDP Mahanadu Donations | భారీ విరాళాలు

ఈ విరాళాల్లో అత్యధిక మొత్తం అందించింది నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు. వీరు ఏకంగా రూ.5 కోట్లు విరాళంగా అందజేసి పార్టీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ భారీ విరాళం మహానాడు వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ చెరో రూ.1.50 కోట్లు చొప్పున విరాళం ప్రకటించారు. వీరిద్దరూ కలిపి మొత్తం రూ.3 కోట్లు పార్టీ నిధికి అందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా విరాళాల విషయంలో వెనుకడుగు వేయలేదు. మంత్రులు టీజీ భరత్ (Bharat), బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాష్యం రామకృష్ణ తలా రూ.1 కోటి చొప్పున విరాళం ప్రకటించారు. మహిళా నేతలు కూడా తమ వంతు సహకారం అందించారు. మంత్రి సవిత రూ.50 లక్షలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రూ.25 లక్షలు, దామచర్ల సత్య రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు.

TDP Mahanadu Donations | నాయకులు సైతం..

అదేవిధంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కూడా లక్షల రూపాయల విరాళాలు (TDP Mahanadu Donations) ప్రకటించారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, శిష్ట్లా లోహిత్ రూ.10 లక్షలు చొప్పున విరాళం ఇవ్వగా.. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్యే రాధాకృష్ణ, గోవర్దన్‌రెడ్డి రూ.5 లక్షలు చొప్పున అందించారు. అలాగే ఎంవీ ప్రణవ్‌గోపాల్ రూ.3 లక్షలు, పట్టాభిరామ్, డూండి రాకేశ్ రూ.2 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఇక ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, అశోక్‌బాబు, నాదెండ్ల బ్రహ్మంచౌదరి, గుమ్మడి గోపాలకృష్ణ, హరిప్రసాద్, జయంతి తదితరులు కూడా ఒక్కో లక్ష రూపాయల చొప్పున విరాళాలు Donations అందించారు. మహానాడు తొలి రోజే ఈ స్థాయిలో విరాళాలు రావడంపై చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహానాడు కార్యక్రమం రెండో రోజు కూడా కీలక రాజకీయ తీర్మానాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరగనున్నాయి.

దీనిని కూడా చదవండి : Nara Lokesh Satires | మహానాడు వేదికగా జగన్‌పై నారా లోకేశ్ విమర్శలు.. డీఎస్సీ విష‌యంలో వైసీపీపై తీవ్ర ఆరోపణలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *