Nara Lokesh Satires | మహానాడు వేదికగా జగన్‌పై నారా లోకేశ్ విమర్శలు.. డీఎస్సీ విష‌యంలో వైసీపీపై తీవ్ర ఆరోపణలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nara Lokesh Satires | మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ మహానాడు వేడుకలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పలు రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ నాయకత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

తన ప్రసంగంలో లోకేశ్ మాట్లాడుతూ, గత మహానాడులో తీసుకున్న ఆరు శాసనాలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం టీడీపీ (TDP) నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. డీఎస్సీ అంశాన్ని ప్రస్తావిస్తూ, నియామక ప్రక్రియకు ఆటంకాలు సృష్టించేందుకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను కార్యకర్తలు, ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థపై గతంలో జరిగిన పరిణామాలను కూడా ఆయన ప్రస్తావించారు.

Nara Lokesh Satires | అనేక మార్పులు చేశాము..

అలాగే టీచర్ల అభివృద్ధి, విద్యా రంగంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ టీడీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేశారు. తమ పాలనలో ఉపాధ్యాయులకు శిక్షణ, అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థలో నిజం కంటే అబద్ధం వేగంగా వ్యాపించే పరిస్థితులు ఉన్నాయని లోకేశ్ వ్యాఖ్యానించారు. పార్టీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి తాము అనేక మార్పులు చేశామని చెప్పారు. జిల్లా స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని, సాధారణ కార్యకర్తలకు కూడా ఉన్నత స్థాయి బాధ్యతలు కల్పిస్తున్నామని తెలిపారు. పార్టీ అభివృద్ధిలో క్షేత్రస్థాయి నాయకులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.

Nara Lokesh Satires | మహానాడు వేదికగా

మహానాడు వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.టీడీపీలో సంస్కరణలు తీసుకు రావడానికి ఎంతో పోరాడిన‌ట్టు కూడా తెలియ‌జేశారు. జిల్లాస్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయికి పార్టీ ఎదుగుదలకు ఎంతో పోరాటం చేశామని చెప్పిన లోకేష్‌… ఒక మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవిని , ధనుంజయ్‌లను పొలిట్‌బ్యూరోకు తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Nara Lokesh Mahanadu | లోకేశ్ సస్పెన్స్ ట్వీట్.. ఆ ‘కీలక ప్రకటన’ ఏంటి?

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *