అక్షరటుడే, వెబ్‌డెస్క్: Akhilesh Yadav | కేంద్ర ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.పార్లమెంట్ ఆవరణలో అఖిలేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
విద్య, పరీక్షలకు సంబంధించిన పోరాటం చాలా పెద్దదన్నారు. యువతలో ఉన్న చైతన్యాన్ని, వారి మనోబలాన్ని ఆయన అభినందించారు. వారి చైతన్యాన్ని ఈ ప్రభుత్వం సవాలు చేయలేదన్నారు. పరీక్షల సంస్కరణ కోసం కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సమాజ్‌వాది పార్టీ అధినేత స్పందిస్తూ.. ప్రభుత్వం ఈ టాస్క్ ఫోర్స్‌ను ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తోందని ప్రశ్నించారు. 2014లోనే ఎందుకు ఏర్పాటు చేసి ఉంటే.. దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందేదన్నారు.
Akhilesh Yadav | ఎంఐఎంతో పొత్తుపై..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఎస్పీతో పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదన చేశారు. దీనిపై అఖిలేశ్ మాట్లాడుతూ.. ఎవరితోనూ పోరాడకండి. దాని అవసరం లేదు. మేము ఇప్పటివరకు అనుసరించిన మార్గంలోనే ముందుకు సాగుతాం అని తెలిపారు. కాగా సమాజ్‌వాది పార్టీ ప్రస్తుతం ఇండియా కూటమిలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: IDFC First Bank Q1 Results | ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ దూకుడు.. ఇంట్రాడేలో 10 శాతం జంప్