AP Covid Cases | ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: AP Covid Cases | ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా carona వైరస్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. రాష్ట్రంలో జూన్ June 26 నుంచి ఇప్పటివరకు 12 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో ఈ కేసులు గుర్తించినట్లు సమాచారం.

AP Covid Cases | Home ఐసోలేషన్‌లో ముగ్గురు

అధికారుల వివరాల ప్రకారం, కొవిడ్-19 సంబంధిత కారణాలతో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురు బాధితులు హోమ్ Home ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవసరమైన సందర్భాల్లో మాస్క్ ధరించడం, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Telangana Sports Development | క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. క్యాష్​ రివార్డులు, సర్కారు ఉద్యోగాల ఆఫర్​ : సీఎం రేవంత్​

AP Covid Cases | వైరస్ వ్యాప్తిపై మరోసారి చర్చ

ఇక దేశంలోని పలు రాష్ట్రాలు, నగరాల్లో కూడా కొవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో వైరస్ వ్యాప్తిపై మరోసారి చర్చ మొదలైంది. దీంతో 2020లో నెలకొన్న పరిస్థితులు మళ్లీ వస్తాయా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

అయితే ప్రస్తుత పరిస్థితులను 2020తో పోల్చాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని, అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అనవసరంగా భయపడకుండా, అధికారిక సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *