అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Abhijit Dipke Hunger Strike | ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Minister Dharmendra Pradhan) రాజీనామా చేయాలని 20 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్షకు దిగారు.
ఢిల్లీ పోలీసులు సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం చేస్తే ఉద్యమం ఆగదని అభిజిత్ అన్నారు. తాను నిరాహార దీక్ష చేపడతానని, తాము ఇక్కడే ఉంటామని ప్రకటించారు. ఎల్లుండి పార్లమెంట్ వరకు పాదయాత్ర చేసి తీరుతామని తెలిపారు.
Abhijit Dipke Hunger Strike | ఆరోగ్యం క్షీణించడంతో..
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సలహా మేరకు, ఆరోగ్యం క్షీణిస్తున్నందున “అవసరమైన వైద్య చికిత్స” కోసం వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించినట్లు న్యూఢిల్లీ డీసీపీ (DCP) కార్యాలయం వెల్లడించిన తరుణంలోనే దిప్కే ఈ ప్రకటన చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై పోలీసులు జరిపిన చర్యల క్రమంలో తనను కొట్టి, అదుపులోకి తీసుకున్నారని దిప్కే ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా ఖాళీ చేయాలని పోలీసులు నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్షా పత్రం లీక్ వివాదంలో ఆరోపించబడిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Bullet Train Project | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్ – జపాన్ మధ్య విభేదాలు.. సిగ్నలింగ్ టెక్నాలజీపై వివాదం!