Kovilpalayam police | 40 కి.మీ. ఛేజ్​.. కారుపై వేలాడుతూ వెళ్లి.. స్మగ్లర్ల అరెస్ట్

గుట్కా స్మగ్లర్లను పట్టుకోవడానికి కోవిల్​పాలయం పోలీసులు 40 కి.మీ. సినిమా స్టైల్​లో ఛేజ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kovilpalayam police | తమిళనాడు (Tamil Nadu)లోని కోవిల్‌పాలయం పోలీసులు సినిమాను తలపించేలా సాహసం చేశారు. గుట్కా స్మగ్లర్ల కోసం 40 కిలోమీటర్లు ఛేజ్​ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు.

ముగ్గురు నిందితులు కర్ణాటక (Karnataka) నుంచి ఒక కారులో 300 కిలోల వరకు గుట్కా, నిషేధిత పొగాకు ఉత్పత్తులను తీసుకొని కోయంబత్తూరు వస్తున్నారు. ఎస్​ఐ విఘ్నేష్, హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్‌లతో కూడిన సిబ్బంది కోవిల్‌పాలయం ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కర్ణాటక నుంచి వస్తున్న కారును సైతం వారు ఆపారు. అనంతరం కారు డిక్కీలో ఉన్న సంచులను తనిఖీ చేయడానికి యత్నించగా రాజస్థాన్​కు చెందిన ఆ ముగ్గురు నిందితులు పోలీసులను పక్కకు నెట్టివేసి, కారు వేగంగా పారిపోయారు.

Kovilpalayam police | కారుపై దూకి..

దీంతో వెంటనే స్పందించిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ నిందితుల కారుపైకి దూకాడు. పైకప్పును పట్టుకొని వేలాడుతూ నిందితులను ఆపేందుకు యత్నించాడు. అయితే వాహనంపై పోలీసు అధికారి ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోకుండా, స్మగ్లర్లు అతివేగంగా వాహనాన్ని తీసుకెళ్లారు. 40 కిలోమీటర్ల వరకు ఆయన అలాగే వేలాడుతూ వెళ్లగా.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు కారులో ఛేజ్​ చేశారు. చివరకు 40 కిలోమీటర్ల తర్వాత నిందితులను కారును ఆపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోగా.. హెడ్​ కానిస్టేబుల్​ కారుపై వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిని కూడా చదవండి : Metpalli CDPO ACB Arrest | లంచానికి ఈఎంఐల స్కెచ్‌.. ఏసీబీ వలలో అంగన్‌వాడీ ప్రాజెక్ట్ ఆఫీసర్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *