అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telegram Signal Notices | వాట్సప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి ఇటీవల మెటా Meta కు నోటీసులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు నోటీసులు జారీ చేసింది.
Telegram Signal Notices | యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించిన
ఈ నోటీసుల్లో ఆయా యాప్‌లలో అందుబాటులో ఉన్న యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్రం కోరింది. అలాగే ఈ ఫీచర్‌ను దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు అమలు చేస్తున్న భద్రతా చర్యలు, ధృవీకరణ విధానాలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం.
IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం

Telegram Signal Notices | మెసేజింగ్ సేవల భద్రతా ప్రమాణాలు
వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ అమలుపై కేంద్రం ఇప్పటికే మెటా నుంచి వివరణ కోరిన నేపథ్యంలో, ఇప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఇతర ప్రముఖ మెసేజింగ్ సేవల భద్రతా ప్రమాణాలను కూడా సమీక్షించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
యూజర్ల గోప్యతను కాపాడడంతో పాటు నకిలీ ఖాతాలు, మోసాలు, సైబర్ నేరాలకు అవకాశం లేకుండా తగిన భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.