Gig Workers Compensation | మరణించిన గిగ్ వర్కర్ల కుటుంబాలకు పరిహారం అందజేత

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gig Workers Compensation | గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy) అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆయన ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించారు.

రాష్ట్రంలో గిగ్​ వర్కర్లకు ప్రభుత్వం బీమా కల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల మరణించిన కార్మికుల కుటుంబాలకు బుధవారం మంత్రి చెక్కులు పంపిణి చేశారు. గిగ్ వర్కర్లు లోకుర్తి నరేష్, జి. శ్యామ్ సుందర్, అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్ కుటుంబాలకు మంత్రి స్వయంగా చెక్కులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ. ప్రభుత్వం గిగ్ వర్కర్లకు అండగా ‘గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం’ తీసుకొచ్చిందన్నారు.

Gig Workers Compensation | అండగా ఉంటాం

కష్టకాలంలో ప్రతి కార్మికుడికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్లు, హమాలీలు, ఇతర కార్మికులందరికీ ప్రభుత్వం నుంచి మద్దతు, రక్షణ లభించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, అదనపు కమిషనర్ ఇ. గంగాధర్, గిగ్ కార్మికుల సంఘం నాయకుడు సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Heatwave Alert | మళ్లీ పెరగనున్న ఎండల తీవ్రత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *