Telangana 1 Crore Insurance | దేశంలోనే ఫస్ట్ టైమ్.. ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి ఉచిత బీమా..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో పాటు పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.కోటి ఉచిత ప్రమాద బీమా పథకం దేశంలోనే ప్రథమమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana 1 Crore Insurance | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో పాటు పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.కోటి ఉచిత ప్రమాద బీమా పథకం దేశంలోనే ప్రథమమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడకుండా ఆదుకోవాలనే మానవీయ దృక్పథంతోనే ఈ పథకాన్ని తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వంపైనా, ఉద్యోగులపైనా ఎలాంటి రూపాయి భారం పడకుండా బ్యాంకర్ల సహకారంతో ఈ బీమాను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

Telangana 1 Crore Insurance | 12.91 లక్షల మందికి లబ్ధి..

ముందుగా సింగరేణి ఉద్యోగులతో ఈ పథకాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ఎనర్జీ శాఖ ఉద్యోగులకు, అనంతరం రాష్ట్రంలోని దాదాపు 12.91 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని విస్తరించినట్లు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,91,056 మందికి రక్షణ లభిస్తోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇందులో 5,18,293 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా.. 5,00,158 మంది తాత్కాలిక, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, డైలీవేజ్, సెర్ప్ సిబ్బంది ఉన్నారు. వీరే కాకుండా 2,72,600 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కూడా ఈ బీమా ధీమా వర్తిస్తుందని వివరించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే వచ్చిన 98 క్లెయిమ్‌లను అత్యంత వేగంగా పరిష్కరించి బాధితుల కుటుంబాలకు కోట్ల రూపాయల చెల్లింపులు పూర్తి చేసినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. కేవలం బీమా మాత్రమే కాకుండా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక హెల్త్‌కార్డులను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు శాసనసభ వేదికగా ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Ponnam Prabhakar RTC | మహిళలకు రూ.12,000 కోట్లకు పైగా ఆదా.. మంత్రి పొన్నం ప్రభాకర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *