Telangana Light Rain | నేడు తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్​

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Light Rain | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు.

రాష్ట్రం (Telangana)లో అక్కడక్కడ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జల్లులు కురిసే ఛాన్స్​ ఉంది. అయితే ఇవి విస్తారమైన వర్షాలు కావు. రాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్​, వరంగల్​, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్​ నగరంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతాయి.

Telangana Light Rain | వర్షపాతం వివరాలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా నల్గొండ జిల్లా అనుముల హాలియాలో 40.3 మి. మీ. వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో 37, కొత్తగూడెం మోదుకూరు 35, కరీంనగర్​ జిల్లా గంగాధరలో 32 మి.మీ. వర్షం కురిసింది.

ఇది కూడా చదవండి..: Peddi Sudarshan Reddy Statue | పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు..కేటీఆర్ తీవ్ర ఆగ్రహం..అసలేం జరిగిందంటే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *