Mamata Banerjee| తృణమూల్ కీలక భేటీకి 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా.. బెంగాల్ రాజకీయంలో ప్రకంపనలు!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Mamata Banerjee| పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ స్పష్టం చేయడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పరిస్థితిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Mamata Banerjee|80 మంది ఎమ్మెల్యేలలో 70 మంది మాత్రమే హాజరు..

పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు, భవిష్యత్ వ్యూహాలను ఖరారు చేసేందుకు మమతా బెనర్జీ ఇటీవల ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. అయితే, ఈ భేటీకి కొంతమంది ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. విజయం సాధించిన 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 70 మంది మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారని సమాచారం. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఈ కీలక భేటీకి రాకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Mamata Banerjee|టీఎమ్‌సీ వివరణ..

ఈ ఊహాగానాలను తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేశాయి. సమావేశానికి రాలేని ఎమ్మెల్యేలు ముందస్తుగానే అనుమతి తీసుకున్నారని, పార్టీలో ఎటువంటి చీలికలు లేవని స్పష్టం చేశాయి.

ఎన్నికల పరాజయం తర్వాత మమతా బెనర్జీ తీసుకున్న పట్టుదల నిర్ణయం ఒకవైపు, ఎమ్మెల్యేల గైర్హాజరు మరోవైపు బెంగాల్ రాజకీయాలను ఆసక్తికర మలుపు తిప్పుతున్నాయి. తృణమూల్ తన పట్టును నిలబెట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Indian Cricket Schedule | ఐపీఎల్ త‌ర్వాత టీమిండియా షెడ్యూల్ బిజీ బిజీ.. మహిళలు, అండర్-19 జట్లకు కూడా కీలక టోర్నీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *