అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RIMS Hospital Accident | ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో మరో చిన్నారి మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరగా.. మరో 23 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి చిన్నారుల వార్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఈ ఘటనలో ఐదు రోజుల శిశువు మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. 24 మంది చిన్నారులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో మరో శిశువు చనిపోయింది.
RIMS Hospital Accident | విచారం వ్యక్తం చేసిన సీఎం
రిమ్స్ ఎస్ఎన్సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలన్నారు.
ఇది కూడా చదవండి..: Adilabad RIMS Incident | ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. చిన్నారుల వార్డులో పేలిన ఏసీ.. 5 రోజుల శిశువు దుర్మరణం.. 24 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం!