తెలంగాణAkunuri Murali Resignation | విద్యా కమిషన్​ ఛైర్మన్​ పదవికి ఆకునూరి మురళి రాజీనామా

Akunuri Murali Resignation | విద్యా కమిషన్​ ఛైర్మన్​ పదవికి ఆకునూరి మురళి రాజీనామా

విద్యా కమిషన్​ ఛైర్మన్​ పదవికి మాజీ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే ఆయన రిజైన్​ చేయడం గమనార్హం.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Akunuri Murali Resignation | రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యా కమిషన్​ ఛైర్మన్​ పదవికి మాజీ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి (Akunuri Murali) రాజీనామా చేశారు. మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే ఆయన రిజైన్​ చేయడం గమనార్హం.

ఆకునూరి మురళి 2006 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ (IAS)​ అధికారి. ఆయన పలు జిల్లాలకు కలెక్టర్లుగా పని చేశారు. వివిధ కీలక పదవులు నిర్వహించారు. ఆయన 2019 జూలైలో స్వచ్ఛంద విరమణ (VRS) కోసం దరఖాస్తు చేసి, 2019 ఆగస్టు 31 నుంచి సేవల నుంచి తప్పుకున్నారు.ఆ సమయంలో తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, తగిన బాధ్యతలు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖ సలహాదారుగా కూడా పనిచేశారు.

Akunuri Murali Resignation | కాంగ్రెస్​ వచ్చాక..

ఆకునూరు మురళి గత బీఆర్​ఎస్ (BRS)​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యా వ్యవస్థపై ఆయన పోరాటం చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఆయనను విద్యా కమిషన్​ ఛైర్మన్​గా నియమించింది. 2024 సెప్టెంబర్​ 3న ప్రభుత్వం విద్యా కమిషన్​ను ఏర్పాటు చేసింది. కమిషన్​ ఛైర్మన్​గా సెప్టెంబర్ 6న మురళిని నియమించింది. ఆయన పదవీ కాలం రెండేళ్లుగా పేర్కొంది. దీంతో 2026 సెప్టెంబర్​ 2 వరకు ఆయన పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అయినా కూడా శుక్రవారం మురళి రాజీనామా చేశారు.

Akunuri Murali Resignation | పని పూర్తి కావడంతో..

ఆకునూరి మురళి తన రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించారు. తనకు అప్పగించిన పనిని పూర్తి చేసినందున విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై ఆయన ఎంతోకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో కమిషన్​ ఛైర్మన్​ అయ్యాయ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సూచించారు. అంతేగాకుండా పలు కీలక సంస్కరణలను నివేదికలో పొందుపరిచారు. ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. అయితే తాజాగా ఆయన రాజీనామా ఎందుకు చేశారనే దానిపై చర్చ జరుగుతోంది. పని పూర్తయిందని రాజీనామా చేశారా.. లేఖ ఇంకా ఏమైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.

దీనిని కూడా చదవండి : ADE Bribery Arrest | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mopal Police Arrest | ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడి అరెస్టు

అక్షరటుడే, డిచ్​పల్లి(మోపాల్): Mopal Police Arrest | నిజామాబాద్​ జిల్లా మోపాల్...

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jukkal MLA Comments | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు...

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...

NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్...