Adilabad RIMS Sexual Harassment | ఆపరేషన్ థియేటర్‌లోనే పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నర్సింగ్ అధికారి అరెస్టు.. రిమ్స్​లో ఘటన!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Adilabad RIMS Sexual Harassment | వైద్య సేవలు అందిస్తూ, తోటి సిబ్బందికి రక్షణగా నిలవాల్సిన ఆసుపత్రి ప్రాంగణంలోనే దారుణ ఘటన వెలుగుచూసింది.

ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) మెడికల్ కాలేజీలో పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) మహిళా వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఆసుపత్రిలోని అత్యంత కీలకమైన ఆపరేషన్ థియేటర్ (OT) లోనే నర్సింగ్ అధికారి ఈ ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా సంచలనంగా మారింది.

Adilabad RIMS Sexual Harassment | ఆపరేషన్ థియేటర్‌లోనే అఘాయిత్యం

పోలీసుల కథనం, బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. రిమ్స్ ఆసుపత్రిలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని విధులు ముగించుకునే క్రమంలో ఆపరేషన్ థియేటర్ లో ఉన్న సమయంలో అక్కడ పనిచేసే ఒక మేల్ నర్సింగ్ అధికారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

అభ్యంతరకర రీతిలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ పోకిరీ చేష్టలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఈ ఊహించని పరిణామంతో సదరు విద్యార్థిని తీవ్ర దిగ్భ్రాంతికి, మానసిక క్షోభకు గురైంది.

Adilabad RIMS Sexual Harassment | పోలీసులకు ఫిర్యాదు – నిందితుడి అరెస్టు

ఈ ఘోర అవమానంపై ధైర్యంగా స్పందించిన బాధిత పీజీ విద్యార్థిని ఆదిలాబాద్ టూ-టౌన్ పోలీసులను ఆశ్రయించి, నిందితుడిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడైన నర్సింగ్ అధికారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. శనివారం నాడే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

అయితే, ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలగకుండా చూసేందుకు, అంతర్గత విచారణల నేపథ్యంలో ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Adilabad RIMS Sexual Harassment | వైద్య వర్గాల్లో ఆందోళన – భద్రతపై ప్రశ్నలు

ఈ ఘటనపై రిమ్స్ జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరాయంగా రోగుల ప్రాణాలు కాపాడేందుకు శ్రమించే ఆపరేషన్ థియేటర్ లోనే మహిళా డాక్టర్లకు రక్షణ కరవైతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడైన నర్సింగ్ అధికారిపై కఠినమైన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రి ప్రాంగణంలో, ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళా వైద్యులకు, సిబ్బందికి గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని కాలేజీ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Chola Copper Plates | 14 ఏళ్ల నిరీక్షణకు తెర.. స్వదేశానికి ‘చోళుల కాలం నాటి రాగి శాసనాలు’!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *