Madurai road accident | ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఐదుగురి దుర్మరణం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Madurai road accident | తమిళనాడులో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మదురై జిల్లా మేలూరు సమీపంలోని అయ్యాపట్టి విలకు వద్ద గల నాలుగు వరుసల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం మే 17, 2026 (ఆదివారం) సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Madurai road accident | దర్శనం చేసుకుని వస్తుండగా..

ఒకే కుటుంబానికి చెందిన వారు సమయపురం మారియమ్మన్ కోయిల్‌లో ప్రత్యేక పూజలు, దర్శనం ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Madurai road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి

కారు మేలూరు సమీపానికి రాగానే ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, కారు అతివేగంగా రోడ్డు మధ్యలో ఉన్న సిమెంట్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా మదురైలోని అన్నానగర్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా (ప్రకాష్, అతని బంధువులుగా) ప్రాథమికంగా గుర్తించారు.

సమాచారం అందుకున్న కొట్టాంపట్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మదురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా.. లేదా అతివేగం కారణమా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *