Dichpalli Railway Gate | డిచ్‌పల్లిలో మొరాయించిన రైల్వేగేట్.. స్తంభించిన ట్రాఫిక్

డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ పరిధిలోని ఘన్‌పూర్ వైపు వెళ్లే రైల్వే గేట్ సాంకేతిక సమస్యతో మోరాయించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి: Dichpalli Railway Gate | డిచ్‌పల్లి (dichpally) రైల్వే స్టేషన్ పరిధిలోని ఘన్‌పూర్ వైపు వెళ్లే రైల్వే గేట్ సాంకేతిక సమస్యతో మొరాయించింది. దీంతో మంగళవారం సాయంత్రం ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

Dichpalli Railway Gate | గేట్​ తెరుచుకోకపోవడంతో..

రైల్వేగేట్​ మంగళవారం సాయంత్రం వేళ గేట్ మూసివేసిన అనంతరం తిరిగి తెరచుకోకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు 40 నిమిషాల పాటు గేట్ ఓపెన్ కాకపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ద్విచక్ర వాహనాలు, కార్లు, అత్యవసర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మరమ్మతు చర్యలు చేపట్టారు. సుమారు అరగంట పాటు శ్రమించి సాంకేతిక లోపాన్ని సరిచేసి గేటును తెరవడంతో వాహన రాకపోకలకు అంతరాయం తొలగింది.

ఇది కూడా చదవండి: రైలు కిటికీలో నుంచి ఫోన్​ చోరీకి యత్నం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *