Chintal Cyanide Death | బంగారం దుకాణంలో సైనైడ్​ మింగి చిన్నారి మృతి

హైదరాబాద్​లోని చింతల్​లో ప్రమాదవశాత్తు సైనైడ్​ మింగి రెండేళ్ల బాలిక మృతి చెందింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chintal Cyanide Death | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చింతల్​లో గల ఓ బంగారు దుకాణంలో అనుకోకుండా సైనైడ్​ మింగిన చిన్నారి (2) మృతి చెందింది. ఈ ఘటన ఈ నెల 7న చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

స్థానికంగా నివాసం ఉండే గోపీ కృష్ణ, జానకి దంపతులు ఈ నెల 7న తమ కుమార్తె మిషాతో కలిసి చింతల్​లోని బంగారు దుకాణానికి వచ్చారు. బంగారం కొనుగోలు చేయడానికి తల్లిదండ్రులు ఆభరణాలు చూస్తుండగా.. అక్కడ టేబుల్​పై ఉన్న సైనైడ్​ను మిషా తీసుకొని నోట్లో పెట్టుకుంది. గమనించి దుకాణ నిర్వాహకుడు వెంటనే బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది.

Chintal Cyanide Death | కుటుంబ సభ్యుల ఆందోళన

బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి దుకాణాల్లో సైనైడ్​ను వినియోగిస్తారు. అయితే దుకాణం యాజమాన్యం ఆ ప్రమాదకరమైన రసాయనాన్ని చిన్నారికి అందుబాటులో ఉండేలా బల్లపై ఉంచడంతో మిషా ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు దుకాణం ఎదుట ఆందోళన చేశారు. మిషాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విష్ణు జ్యువెలరీ బయట నిరసన చేపట్టారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Police | హైదరాబాద్​లో మహిళ దారుణ హత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *