అక్షరటుడే, వెబ్‌డెస్క్: CJP Protest | సీజేపీ నిరసనల్లో పాల్గొనడానికి వెళ్తున్న బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్‌మంతర్‌కు వెళ్తున్న మమతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బస్టాండ్ వద్ద కూర్చొని నిరసన తెలుపగా.. ఆమెతో పాటు పలువురు ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
CJP Protest | సీఈసీ రాజీనామా చేయాలి
మమత (Mamata Banerjee)తో పాటు ఐదుగురు ఎంపీలను బస్సులో అక్కడి నుంచి తరలించారు. నిరసన సమయంలో ఆమె నోటికి బ్యాండడ్జ్ వేసుకొని కూర్చున్నారు. ఉదయం నుంచి కేజ్రీవాల్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను కూడా అరెస్ట్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Shashi Tharoor | ఢిల్లీలో ఆంక్షలపై శశిథరూర్ ఆగ్రహం