Visakhapatnam Accident | విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు

Naresh Chandan

Visakhapatnam Accident | ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు.. లారీని ఢీకొనడంతో ఈ విషాద ఘటన సంభవించింది.

Visakhapatnam Accident | మృతుల్లో బాలుడు..

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.

Rakesh Reddy Self Goal | రాకేశ్ రెడ్డి సెల్ఫ్ గోల్: ‘హామీల’ బోనులో ఆర్మూర్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ ‘రివర్స్ అటాక్’ పొలిటికల్ సెటైర్!

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే అంశంపై సమాచారం సేకరిస్తున్నారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *