Bhanu Prakash Reddy | బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జి అరవింద్ సింగ్ భదౌరియాతో భాను ప్రకాష్ రెడ్డి భేటీ

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఇటీవల నియమితులైన అరవింద్ సింగ్ భదౌరియాను టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhanu Prakash Reddy | బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఇటీవల నియమితులైన అరవింద్ సింగ్ భదౌరియాను టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అరవింద్ సింగ్ భదౌరియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పార్టీ కార్యకలాపాలు, సంస్థాగత అంశాలపై భేటీలో ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

Bhanu Prakash Reddy | మరింత బలోపేతం కావాలంటూ..

భదౌరియా అనుభవం, సమర్థవంతమైన మార్గనిర్దేశకత్వంతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మరింత బలోపేతం కావాలని భాను ప్రకాష్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా రాష్ట్ర రాజకీయ, పార్టీ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: KLU Library Fire | కేఎల్ యూనివర్సిటీలో భారీ అగ్నిప్రమాదం

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *