PETA President Election | పెటా అధ్యక్షుడిగా డాక్టర్​ అబ్బాపూర్​ రవీందర్​

జిల్లా ఫిజికల్​ ఎడ్యుకేషన్​ టీచర్స్​ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్​ అబ్బాపూర్​ రవీందర్​ ఎన్నికయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ఫిజికల్​ ఎడ్యుకేషన్​ టీచర్స్​ అసోసియేషన్ (PETA Nizamabad) నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్​ అబ్బాపూర్​ రవీందర్ (Dr Abbapur Ravinder)​ ఎన్నికయ్యారు. నిజామాబాద్​ నగరంలోని (Nizamabad) న్యూ అంబేద్కర్​ భవన్​లో శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు.

PETA President Election | అధ్యక్ష, కార్యదర్శులకు ఎన్నికలు..

పెటాలో మొత్తంగా 129 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, కార్యదర్శుల పోస్టులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా డాక్టర్​ అబ్బాపూర్​ రవీందర్ ( పీడీ నవీపేట్​ జడ్పీహెచ్​ఎస్)​​ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా గంగాధర్​ (ఆర్మూర్​ పీడీ)​ గెలుపొందారు. నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఇది కూడా చదవండి: నా తమ్ముడు.. అనంత్ అంబానీ! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *