Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం

కంచన్‌బాగ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. డివైడర్​ను ఢీకొని రోడ్డు కిందకు పడిపోయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Car Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కారు బీభత్సం సృష్టించింది. కంచన్‌బాగ్‌లో, బాబా నగర్ ఫంక్షన్ హాల్ సమీపంలో అతివేగంగా వస్తున్న మహీంద్రా కారు డివైడర్‌ను ఢీకొట్టి కింద రోడ్డుపై పడిపోయింది.

Hyderabad Car Accident | మద్యం మత్తులో..

ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం, ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్​ మద్యం మత్తులో కారును అతివేగంగా నడపడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తొలగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Houses | ఏడాదిలోపు ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *