Srisailam Promotion | శ్రీశైలంను అభినందించిన సీపీ సాయిచైతన్య

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Srisailam Promotion | నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్​లో (Nizamabad Police Commissionerate) ఎస్​బీ సీఐగా పనిచేస్తున్న శ్రీశైలంకు ఏసీపీగా పదోన్నతి లభించింది. ఈ సదర్భంగా శనివారం ఆయనను సీపీ కార్యాలయంలో(Nizamabad police) పోలీసు కమిషనర్ సాయి చైతన్య(Police Commissioner Sai Chaitanya) అభినందించారు.

Srisailam Promotion | ప్రత్యేక ప్రశంస..

తెలంగాణ డీజీపీ శివధర్​ రెడ్డి (DGP Shivadhar Reddy) ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న శ్రీశైలంకు ఏసీపీగా పదోన్నతి లభించింది. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న శ్రీశైలం సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించడంపై సీపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

sri

ఇది కూడా చదవండి: Hormuz Strait | చర్చల వేళ చిచ్చు.. అమెరికా కఠిన వైఖరితో ఇరాన్ వెనక్కి!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *