Lingampet Husband Attack | భర్త ఘాతుకం.. భార్యపై అర్ధరాత్రి కత్తితో దాడి

దాడి అనంతరం భార్య మృతి చెందిందని భావించిన భర్త అక్కడి నుంచి పారిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Lingampet Husband Attack | భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన భర్త.. అర్ధరాత్రి సమయంలో కూరగాయలు కోసే కత్తితో భార్యపై దాడికి పాల్పడ్డాడు.

తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు. ఈ ఘటన కామారెడ్డి Kamareddy జిల్లా లింగంపేట మండలం ముస్తాపూర్‌లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Lingampet Husband Attack | పుట్టింటికి వచ్చిన భార్యపై దాడి

పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముస్తాపూర్ గ్రామానికి చెందిన యువతికి షెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన బహుగుణ చారితో వివాహం జరిగింది. గత రెండు మూడు రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆమె ముస్తాపూర్‌లోని తల్లిగారి ఇంటికి వచ్చింది. భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు సోమవారం ముస్తాపూర్‌కు వచ్చిన భర్త అక్కడే ఉన్నాడు.

అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో భార్యపై దాడి చేసినట్లు సమాచారం. ఆమె శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం భార్య మృతి చెందిందని భావించిన భర్త అక్కడి నుంచి పరారైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Lingampet Husband Attack | ‘భార్యను చంపేశా’ అంటూ పోలీసులకు సమాచారం?

బాధితురాలి అరుపులు విని కుటుంబ సభ్యులు నిద్రలేచి చూడగా ఆమె తీవ్ర గాయాలతో కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పరారైన భర్త పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను చంపేశానని చెప్పినట్లు సమాచారం.

పోలీసులు వెంటనే ముస్తాపూర్‌కు చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించారు.

ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

భార్యపై భర్త అర్ధరాత్రి కత్తితో దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు హింసాత్మకంగా మారడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *