అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Book Reading Benefits | పుస్తక పఠనంతోనే విజ్ఞానం, వికాసం పెంపొందుతాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) అన్నారు. నగరంలోని(Nizamabad) ఆర్పీ రోడ్‌లో ఉన్న బాపూజీ వాచనాలయంలో విద్యార్థులకు కాంగ్రెస్ నేత రత్నాకర్ ఆధ్వర్యంలో కుర్చీలను పంపిణీ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Book Reading Benefits | విద్యుత్ భవిష్యత్ కోసం..
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌కు పుస్తక పఠనం ఎంతో అవసరమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పట్టణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన లైబ్రరీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా ప్రస్తుతం అరచేతిలోనే ప్రపంచాన్ని చూసే పరిస్థితి వచ్చిందని, స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా యువతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటూనే విద్యార్థులు పుస్తక పఠనానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Book Reading Benefits | లైబ్రరీల ప్రాధాన్యతపై..
యువతకు లైబ్రరీల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు లైబ్రరీ మెంబర్‌షిప్ తీసుకుని పుస్తక పఠనాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాపూజీ వాచనాలయం అధ్యక్షుడు భక్తవత్సలం, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ రాజారెడ్డి, పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నిమజ్జన వేడుకలు చూసేందుకు దండిగా వచ్చినాం.