అక్షరటుడే, వెబ్‌డెస్క్: Peddi Sudarshan Reddy | బీఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయనకు తుది దశ చికిత్స (ఫైనల్ ట్రీట్‌మెంట్) అందించేందుకు యశోద ఆస్పత్రి వైద్యులు సిద్ధమయ్యారు. ఆయన మెదడు నుంచి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం వైద్యులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కొద్ది గంటలు ఆయన ఆరోగ్యానికి అత్యంత కీలకంగా మారాయి.
Peddi Sudarshan Reddy | పవర్‌ఫుల్ ఇంజెక్షన్లు..
ఇప్పటివరకు పెద్ది సుదర్శన్ రెడ్డి మెదడు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో డాక్టర్లు తదుపరి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయనకు రెండు పవర్‌ఫుల్ ఇంజెక్షన్లు ఇచ్చారు. మెదడు పనితీరును, స్పందనను అంచనా వేసేందుకే వీటిని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇంజెక్షన్లు ఇచ్చిన 4 నుంచి 5 గంటల వ్యవధిలో మెదడులో ఏదైనా కదలిక లేదా స్పందన కనిపిస్తే తదుపరి చికిత్సను యథావిధిగా కొనసాగిస్తారు. ఒకవేళ ఎలాంటి స్పందనా లేకపోతే మాత్రం ట్రీట్‌మెంట్‌ను నిలిపివేస్తామని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Peddi Sudarshan Reddy | కేసీఆర్ ఆరా..
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ( KCR )ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందేలా చూస్తూ, ఎప్పటికప్పుడు డాక్టర్లతో ఫోన్లో మాట్లాడుతూ అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు. మరోవైపు, పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.
Peddi Sudarshan Reddy | ఆందోళనలో కుటుంబ సభ్యులు
పెద్ది కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. వైద్యుల మాటలు వారిని మరింత భయపెడుతున్నాయి. నిన్నటి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడుతోందని, మెరుగవుతోందని చెప్పిన డాక్టర్లు.. నిన్న రాత్రి నుంచి అకస్మాత్తుగా పరిస్థితి విషమించిందని చెప్పడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi Remarks | లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై దుమారం.. అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు