Rajiv Gandhi Jayanti | రాజీవ్‌గాంధీ సేవలను కొనియాడిన పొన్నం ప్రభాకర్

దేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు, మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌గాంధీ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కొనియాడారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rajiv Gandhi Jayanti | దేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు, మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌గాంధీ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌  ( Ponnam Prabhakar )కొనియాడారు. ముల్కనూరు అంబేద్కర్‌ చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌.. రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

Rajiv Gandhi Jayanti | 18 ఏళ్లకే ఓటుహక్కు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని గట్టిగా విశ్వసించిన రాజీవ్‌గాంధీ హయాంలోనే 18 ఏళ్లకే ఓటుహక్కు కల్పించి, ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యాన్ని పెంచారని గుర్తుచేశారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలనే దూరదృష్టితో సమాచార సాంకేతిక (IT), టెలికమ్యూనికేషన్‌ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలకు బాటలు వేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా, గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థను ಬలోపేతం చేయడానికి విశేష కృషి చేశారన్నారు. యువతకు అవకాశాలు, సాంకేతిక పురోగతి, గ్రామీణాభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీవ్‌గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే మనం అర్పించే నిజమైన నివాళి అని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ముల్కనూరు సర్పంచ్‌ జాలి ప్రమోద్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ కాసగోని మమత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొక్కల స్రవంతిరెడ్డి, కాంగ్రెస్‌ మహిళా మండల అధ్యక్షురాలు చిదురాల స్వరూప, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కుల అనిల్‌, సీనియర్‌ నాయకులు ఊసకోయిల ప్రకాశ్‌, కొలుగూరి రాజు, ఆదరి రవీందర్‌, చంద్రశేఖర్‌ గుప్తా, బొజ్జపూరి అశోక్‌ ముఖర్జీ, మంగ రామచంద్రం, చిట్కూరి అనిల్‌, పోగుల శ్రీకాంత్‌, గజ్జల రమేష్‌, సీఐ పులి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  PCC Chief Mahesh Goud | పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : పీసీసీ చీఫ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *