జాతీయంFuel Price Hike | ఇంధన ధరల పెంపుపై రాహుల్​ గాంధీ విమర్శలు

Fuel Price Hike | ఇంధన ధరల పెంపుపై రాహుల్​ గాంధీ విమర్శలు

పెట్రోల్​, డీజిల్​ రేట్ల పెంపుపై రాహుల్​ గాంధీ విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం చేసిన తప్పునకు ప్రజలు ప్రజలు డబ్బులు కట్టాల్సి వస్తోందన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fuel Price Hike | కేంద్ర ప్రభుత్వం (Central Government) దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెంచిన విషయం తెలిసిందే. దీనిపై లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ విమర్శలు చేశారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదలతో కేంద్రం పెట్రోల్​, డీజిల్ ధరలు పెంచింది. పెంచిన ధరలు నేటి ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి. దేశంలో లీటర్​కు రూ.3కు పైగా పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ఎక్స్​వేదికగ స్పందించారు. మోదీ ప్రభుత్వం చేసిన తప్పుకు.. ప్రజలు డబ్బులు కట్టాల్సి వస్తోందన్నారు. రూ.3 రేట్లు ఇప్పటికే పెరిగాయని, మిగతా రేట్లు రానున్న రోజుల్లో విడతల వారీగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. బలహీనపడిన ప్రధానమంత్రి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు. ఆయన అదానీ విడుదల కోసం ఒక ఒప్పందాన్ని కుదిర్చారు అని మరో పోస్ట్​లో పేర్కొన్నారు.

Fuel Price Hike | ఇంకా పెరుగుతాయా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్ముజ్​ జలసంధి మీదుగా రవాణా నిలిచిపోవడంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు బ్రెంట్​ క్రూడ్ ఆయిల్ 70 డాలర్లు ఉండగా.. ప్రస్తుతం 100 డాలర్లు దాటింది. అయితే ధరలు పెరిగిన కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలను ఇన్ని రోజులు పెంచలేదు. దీంతో ఆయా చమురు సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ధరలు పెంచలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు అయిపోవడం, ఫలితాలు వెలువడంతో ధరల బాదుడు మొదలైంది. మొదట గ్యాస్​ ధరలు పెంచిన కేంద్రం, తాజాగా పెట్రోల్​, డీజిల్​ రేట్లను పెంచింది. అయితే రానున్న రోజుల్లో మరింత రేట్లు పెరుగుతాయని రాహుల్ గాంధీ పేర్కొనడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: ITR Filing 2026 | ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయె!.. ఐటీఆర్-1, 4 ఎక్సెల్ యుటిలిటీల విడుదల

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

GHMC MoU | ఐఐటీ ఖరగ్​పూర్​తో జీహెచ్​ఎంసీ ఒప్పందం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC MoU | అత్యంత అధునాతన ఏఐ...

RTC Merger Talks|ఆర్టీసీ విలీనంపై కసరత్తు..కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భేటీ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:RTC Merger Talks|తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన...

Indulekha Hair Serum|జుట్టు రాలే సమస్యకు సైంటిఫిక్ సొల్యూషన్.. ఇందులేఖ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Indulekha Hair Serum|ఆయుర్వేద విజ్ఞానానికి ఆధునిక సైన్స్‌ను జోడిస్తూ 'ఇందులేఖ'...

Sanathnagar TIMS | అంతర్జాతీయ ప్రమాణాలతో టిమ్స్​ ఏర్పాటు చేశాం : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sanathnagar TIMS | దేశంలోనే అత్యధిక వైద్య...