ITR Filing 2026 | ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయె!.. ఐటీఆర్-1, 4 ఎక్సెల్ యుటిలిటీల విడుదల

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: ITR Filing 2026 | ఈ ఏడాది ఆదాయపు పన్ను ఫైలింగ్ సీజన్ ముందుగానే మొదలైంది. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఐటీఆర్-1(సహజ్), ఐటీఆర్-4(సుగమ్) ఎక్సెల్ యుటిలిటీలను శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఆన్‌లైన్ ఫైలింగ్ సదుపాయాన్నీ ప్రారంభించింది.

ITR Filing 2026 | సాధారణ ఫైలింగ్ గడువు జూలై 31 వరకు

ఈ యుటిలిటీలను ఈ -ఫైలింగ్ పోర్టల్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో పూరించి, జేఎస్వోఎన్ ఫైల్ జనరేట్ చేసి, ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ఫైలింగ్ గడువు జూలై 31 వరకు ఉంది. ఎక్సెల్ యుటిలిటీలను incometax.gov.in డౌన్‌లోడ్స్ సెక్షన్‌నుంచి సులభంగా పొందవచ్చు. ముందుగా ఫైల్ చేయడం ద్వారా రీఫండ్ (ఉంటే) త్వరగా వచ్చే అవకాశం ఉంది.

ITR Filing 2026 | ఎవరు ఏ ఫాం ఉపయోగించుకోవాలంటే..?

పన్ను చెల్లింపుదారులు ఏటా తమ ఆదాయం, మినహాయింపులు, పన్ను బాధ్యతకు సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ జూలై 31వ తేదీలోపు దీనిని తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏడు వేరువేరు ఐటీఆర్ ఫారాలు (ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు) అందుబాటులో ఉన్నాయి. పన్ను చెల్లింపుదారు వర్గం, ఆదాయ స్వభావం, ఆదాయ స్థాయిని బట్టి వారికి వర్తించే ఫారం మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఐటీఆర్-1, 4 ఎక్సెల్ యుటిలిటీలను విడుదలయ్యాయి.

ఐటీఆర్-1 : సాలరీ, పెన్షన్, ఒకటి లేదా రెండు ఇళ్ల నుంచి ఆదాయం పొందుతున్నవారు, వడ్డీ ఆదాయం వంటి ఇతర వనరులు, రూ. 5 వేల వరకు వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని ఆర్జించే పన్ను చెల్లింపుదారులు, మొత్తం వార్షికాదాయం రూ. 50 లక్షల వరకు ఉన్న రెసిడెంట్ వ్యక్తులు ఈ ఫాం ఉపయోగించవచ్చు. సెక్షన్ 112 ఏ కింద రూ. 1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలు కలిగిన పన్ను చెల్లింపుదారులు కూడా ఐటీఆర్-1 దాఖలు చేయవచ్చు.

ఐటీఆర్-4 : ప్రెజంప్టివ్ టాక్స్ స్కీమ్ కింద వ్యాపారం లేదా వృత్తి పనుల్లో ఉన్నవారికోసం ఉద్దేశించినది. ఇది నివాస వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, ఎల్ ఎల్‌పీలు కాని ఇతర సంస్థలకు వర్తిస్తుంది. వీరు రూ. 50 లక్షల వరకు మొత్తం ఆదాయాన్ని కలిగి ఉండి, సెక్షన్లు 44ఏడీ, 44ఏడీఏ లేదా 44ఏఈ కింద ‘ప్రెజంప్టివ్ టాక్సేషన్ స్కీమ’ (అంచనా పన్ను విధానం)ను ఎంచుకున్నవారై ఉండాలి. అలాగే 112ఏ కింద రూ. 1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలు కలిగినవారు కూడా దీనిని ఉపయోగించవచ్చు.

ఇది కూడా చదవండి..: Modi Foreign Tour | ఐదు దేశాల పర్యటనకు బయలు దేరిన మోదీ.. కీలక అంశాలపై చర్చించనున్న ప్రధాని

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *