అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prashant Kishor Lead | బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆధిక్యంలో ఉన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామాతో బంకీపూర్ ఉప ఎన్నిక నిర్వహించారు. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఏప్రిల్‌లో ఈ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఇక్కడ బీజేపీ నుంచి నీజర్కుమార్ బరిలో దిగారు. ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జన సురాజ్ పార్టీ పోటీ చేసినా.. ఆయన మాత్రం ఎన్నికల బరి దిగలేదు. ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. తాజాగా ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Prashant Kishor Lead | 4,556 ఓట్ల లీడ్
బంకీపూర్ అసెంబ్లీ ఓట్లను 31 రౌండ్లలో లెక్కించనున్నారు. 8 రౌండ్లు ముగిసే సరికి ప్రశాంత్ కిశోర్ 15,637 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి 11,081 ఓట్లు సాధించారు. దీంతో ప్రశాంత్ కిషోర్ 4,556 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారికి 2,991 మాత్రమే వచ్చాయి. ఏడు రౌండ్లలో ప్రశాంత్‌కిషోర్ లీడ్ సాధించగా.. నీరజ్ ఒక్క రౌండ్లో మాత్రమే ఆధిక్యం సాధించారు.
Prashant Kishor Lead | గుజరాత్లో..
గుజరాత్‌లోని మంజల్పూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు దిశగా సాగుతోంది. 11 రౌండ్లు ముగిసే సరికి ఆ పార్టీ అభ్యర్థి సతీశ్ పటేల్ 31,283 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 17,198 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. మధ్య ప్రదేశ్‌లోని ధాతియ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ కేవలం 308 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఆయనకు 21047 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారి 20,739 ఓట్లు సాధించారు. 5 రౌండ్ల కౌంటింగ్ ముగియగా.. మరో 10 రౌండ్లు మిగిలి ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Brij Bhushan Verdict | వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి : బ్రిజ్ భూషన్