అక్షరటుడే, వెబ్‌డెస్క్: Urea Production | పశ్చిమాసియా సంక్షోభంతో యూరియా బస్తా ధర రూ.3 వేలకు పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అయినా దేశంలోని రైతులకు రూ.300 లోపే అందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ఇబ్బందులు లేకుండా దేశంలో యూరియా ఉత్పత్తి పెంచామన్నారు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో కొత్త విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రధాని మోదీ (Prime Minister Modi) శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం, ఇంటీరియర్ గురించి ఎంతగానో చర్చ జరుగుతోందన్నారు. రాజస్థాన్ సంస్కృతి ప్రతిచోటా కనిపిస్తుందని తెలిపారు. ఇది మార్వార్ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధికి కొత్త ఊతాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Urea Production | ప్రజలపై భారం పడకుండా..
పశ్చిమ ఆసియా సంఘర్షణ నేపథ్యంలో భారతదేశంలో ఇంధన కొరతపై ప్రధాని మాట్లాడారు. ఇంతటి ఊహించని సవాలు నుంచి దేశం అదృష్టం కొద్దీ కోలుకోలేదని.. దశాబ్ద కాలంగా తాము అమలు చేస్తున్న దూరదృష్టితో కూడిన విధానాలు ఇందులో కీలక పాత్ర పోషించాయన్నారు. మారుమూల ప్రాంతాలలో కూడా, చిన్నపాటి ఆటంకాలు మినహా, సరఫరా విషయంలో పెద్ద సవాళ్లు ఏవీ ఎదురు కాలేదన్నారు. , జూన్ నెలల మధ్యనే, డీజిల్, పెట్రోల్‌పై కంపెనీలు రూ. 75 వేల కోట్లకు పైగా నష్టాన్ని భరించాల్సి వచ్చింది. ఈ నష్ట భారాన్ని ప్రభుత్వ ఖజానా భరించిందన్నారు. ప్రజలపై అధిక భారం పడకుండా చూసేందుకు, లీటరుపై రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గించామని మోదీ గుర్తు చేశారు.
Urea Production | 40 దేశాల నుంచి..

యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, భారత్ 24 నుంచి 26 దేశాల నుంచి మాత్రమే ఇంధనాన్ని దిగుమతి చేసుకునేదని ప్రధాని తెలిపారు. సంక్షోభం సమయంలో 40కి పైగా దేశాల నుండి ఇంధనాన్ని సేకరించడం ప్రారంభించిందన్నారు. మన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపై ఆధారపడినట్లు మోదీ తెలిపారు. అందులో 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తాయని చెప్పారు. హర్ముజ్ మూసుకుపోవడంతో తీవ్ర సంక్షోభం ఎదురైందన్నారు. అయితే రిఫైనరీ సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంపై దృష్టి సారించడంతో ఏడు రోజుల్లోనే LPG ఉత్పత్తి పెరిగిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Eknath Shinde | ఆస్పత్రిలో చేరిన ఏక్‌నాథ్ షిండే..