NEET Exam Scam | ‘నీట్’ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత : కేటీఆర్​

'నీట్' పరీక్షల కుంభకోణం, పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Exam Scam | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్’ పరీక్షల కుంభకోణం, పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. నష్టపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan)ను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్​ చేశారు.

కేటీఆర్​ మలేషియా పర్యటనకు వెళ్లారు. అంతకుముందు హైదరాబాద్​ (Hyderabad)లో నీట్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. తప్పు చేసిన పెద్దలపై చర్యలు తీసుకుంటేనే, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి 520కి పైగా మార్కులు సాధించినా, పేపర్ లీక్ కావడం వల్ల తమ శ్రమ అంతా వృథా అయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

NEET Exam Scam | ఎందుకు అడ్డుకోలేదు

ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లే ముందు తమను అణువణువూ తనిఖీ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులు, పేపర్ లీక్‌ను ఎందుకు అడ్డుకోలేకపోయారని విద్యార్థులు ప్రశ్నించారు. తప్పు ఎన్టీఏ బోర్డు చేసి, విద్యార్థులను మళ్లీ మళ్లీ పరీక్షలకు కూర్చోబెట్టడం ఏ రకంగా న్యాయమని మండిపడ్డారు. విద్యార్థులకు కేటీఆర్​ సంఘీభావం తెలిపారు. పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. భవిష్యత్​లో పేపర్​ లీక్​ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

  దీనిని కూడా చదవండి : Surat Gas Leak | జ్యువెలరీ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్.. ట్యాంక్ క్లీన్ చేస్తూ నలుగురు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *