అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Congress Criticism | ఇన్ని రోజులు దీక్ష చేయని అర్వింద్ (MP Arvind).. నిధులొచ్చే వేళ నిరసనలు తెలుపడాన్ని ప్రజలు గమనిస్తున్నారని డీసీసీ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (DCC Nizamabad) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Nizamabad Congress Criticism | గంగిరెద్దుల వారు చప్పుడు చేసినట్లు..
సంక్రాంతికి గంగిరెద్దుల వారు ఇంటికి వచ్చి చప్పుడు చేసిన విధంగా ఏదో ఒక చప్పుడు చేయడం అర్వింద్‌కు అలవాటైపోయిందన్నారు. స్కూల్ పిల్లలను బలవంతంగా ధర్నాలో కూర్చోబెట్టి వారి సమయాన్ని చదువును స్వార్థాల కోసం వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించి విద్యార్థులను ధర్నాలో కూర్చోబెట్టారని ఆరోపించారు. రూ.కోట్లల్లో ధాన్యం కుంభకోణం చేసిన వ్యాపారులు తప్ప వారికి మద్దతు తెలుపుతూ ఎటువంటి వాణిజ్య, స్వచ్ఛంద సంస్థలు రాలేదని దుయ్యబట్టారు. మొన్ననే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులను సీఎం దగ్గరికి తీసుకువెళ్లి జిల్లా అభివృద్ధి కోసం నిధులు మంజూరు విషయంలో చర్చించారన్నారు.
Nizamabad Congress Criticism | అర్వింద్ నాటకమిది..
త్వరలోనే నిజామాబాద్‌లో అభివృద్ధి పనులు జరుగుతాయని గ్రహించిన అర్వింద్ ధర్నా చేయడం తానే చేయించానని గొప్పలు చెప్పుకోవడానికి చేస్తున్న నాటకమే ఈ ధర్నా అని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇటీవల మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ తో అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని ఎన్నికల తర్వాత అభివృద్ధిలో కలిసే పని చేస్తామని చెప్పారన్నారు. కానీ అర్వింద్‌కు భయపడి ఆయనతో కలిసి ధర్నాలో కూర్చోవడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. నిజామాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే హర్షం వ్యక్తం చేయాలి కానీ వాటికి అడ్డుపడే విధంగా ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. అర్వింద్ కేంద్రం నుండి నిధులు తీసుకువస్తే స్వాగతిస్తామని అంతేకానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుగా వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ధర్నాల ద్వారా సానుభూతి వస్తుందనుకుంటున్నాడు కానీ రాబోయే రోజుల్లో అర్వింద్‌ను నిజామాబాద్ నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
ఇది కూడా చదవండి: జైలులో సినిమా లెవెల్ యాక్టింగ్.. 17 మంది ఖైదీలు పరారీ!