అక్షరటుడే, వెబ్డెస్క్ : DIEO Caught by ACB | సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి (DIEO) రమావత్ గోవింద్రామ్ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు చిక్కాడు. ఓ కాలేజీ అనుమతి పునరుద్ధరణ కోసం ఆయన లంచం డిమాండ్
సంగారెడ్డిలోని వికాస్ వొకేషనల్ జూనియర్ కళాశాల పునరుద్ధరణ కోసం తాత్కాలిక అనుబంధ గుర్తింపు పొడిగింపునకు తనిఖీ నిర్వహించి, నివేదిక సమర్పించేందుకుగాను డీఐఈవో రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. అందులో రూ.30 వేలు ఇప్పటికే తీసుకున్నాడు. ఈ క్రమంలో కాలేజీ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం బాధితుడి నుంచి మరో రూ.20 వేలు తీసుకుంటుండగా డీఐఈవో గోవింద్రామ్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, ఆయన కార్యాలయంలో తనిఖీ చేశారు.
DIEO Caught by ACB | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ అయిన 1064, వాట్సాప్ నంబర్ (9440446106) ద్వారా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా, బహుమతుల రూపంలో అడిగిన ఇవ్వొద్దని కోరారు. బాధితుడు/ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
దీనిని కూడా చదవండి : Panchayat Raj Amendment | అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సీతక్క..