Kavitha New Party | నా పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ : కవిత

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha New Party | తాను పెట్టబోయే పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఆమె ఈ నెల 25న కొత్త పార్టీ పెట్టనున్న విషయం తెలిసిందే.

బసవేశ్వరుడి 839వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి కవిత నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. 839 ఏళ్ల క్రితం బసవేశ్వరుడి రూపంలో కొత్త విప్లవం పుట్టిందన్నారు. ఆ రోజు బసవేశ్వరుడు పాటించిన ప్రజాస్వామిక విలువలు, తీసుకువచ్చిన మార్పులను మనం ఈ రోజుకూ స్మరించుకుంటున్నామని చెప్పారు. కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా సమానత్వం ఉండాలని బసవేశ్వరుడు చెప్పారన్నారు.

Kavitha New Party | సామాజిక న్యాయం కోసం..

బసవేశ్వరుడు చెప్పిన సమానత్వం, సమాన అవకాశాల కోసం ఈ రోజుకు పాటు పడుతున్నాం అంటే మనం వెనుకబడి ఉన్నట్టు లెక్క అని కవిత అన్నారు. బసవేశ్వరుడి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) స్ఫూర్తి పొందారన్నారు. ఆయన స్ఫూర్తితో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తుందని ప్రకటించారు.

Kavitha New Party

Kavitha New Party | కుట్రలు చేశారు

పార్లమెంట్​లో మహిళా బిల్లును పాస్ కాకుండా అనేక శక్తులు కుట్రలు చేసి అడ్డుకున్నాయని కవిత ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ మహిళలకు ఎనిమిది సీట్లు ఇస్తే మరో పార్టీ పది సీట్లు ఇచ్చిందన్నారు. తమ పార్టీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్​ అమలు చేస్తామని తెలిపారు. పార్టీ పదవులు, ఎన్నికల సీట్ల విషయంలో దీనిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: RTC Workers Strike | సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు.. చర్చలకు పిలవని ప్రభుత్వం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *