AI Plus Nova Flip | సూపర్ ఫీచర్స్‌తో ఫ్లిప్ ఫోన్..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AI Plus Nova Flip | ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన ఏఐ ప్లస్ మరో ప్రీమియం మోడల్ ను భారత మార్కెట్ లో రిలీజ్ చేసింది. ఏఐ ప్లస్ నోవా ఫ్లిప్ ఫోన్ పేరుతో సింగిల్ వేరియంట్ లో తీసుకువచ్చిన ఈ కొత్త ఫ్లిప్ ఫోన్‌లో అధునాతన మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్ అమర్చారు. మే 8 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో సేల్ ప్రారంభం కానుంది. దీని స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.9 ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ ప్లేతోపాటు 3.1 ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ , 1188 x 2790 పిక్సల్స్ రిజల్యూషన్ , ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కలిగి ఉంది.

ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఎన్ ఎక్స్ టీక్యూ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది.

కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

AI Plus Nova Flip | బ్యాటరీ సామర్థ్యం..

4325 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

AI Plus Nova Flip | సింగిల్ వేరియంట్ ..

గ్లేసియర్ వైట్ కలర్ లో సింగిల్ వేరియంట్ లో ఈ మోడల్ ను రిలీజ్ చేశారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999. ఎస్ బీఐ క్రెడట్ కార్డు ద్వారా రూ. 7 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ఇది కూడా చదవండి..: May 08 Market Analysis | ఎరుపెక్కిన మార్కెట్లు.. నష్టాýతో ప్రారంభంకానున్న సెన్సెక్స్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *