జాబ్స్​ & ఎడ్యుకేషన్​SPMCIL Jobs | కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో జాబ్స్..

SPMCIL Jobs | కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో జాబ్స్..

పలు పోస్టుల భర్తీ కోసం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ఈనెల 19 వరకు ఉంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SPMCIL Jobs | ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.

SPMCIL Jobs | భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 534.

పోస్టులు, అర్హతల వివరాలు :
సేఫ్టీ ఆఫీసర్: ఇంజినీరింగ్ డిగ్రీ
సూపర్‌వైజర్ పోస్టులు(టెక్నికల్ కంట్రోల్ /ఐటీ /సివిల్ /మెకానికల్ /ఎలెక్ట్రానిక్స్ ): డిప్లొమా లేదా బీఈ /బీటెక్ లేదా పీజీ
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం అవసరం.
జూనియర్ టెక్నిషియన్ (ప్రింటింగ్ /ఎలక్ట్రికల్ / ఫిట్టర్ / ఎలెక్ట్రానిక్స్ ) : సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ఎన్ సీవీటీ /ఎస్ సీవీటీ)

వయో పరిమితి: 18 నుంచిి 30 ఏళ్లు (పోస్టును బట్టి వయో పరిమితి అర్హతలు మారుతాయి)

వేతనం:
ఆఫీసర్ స్థాయి : రూ. 29,740 – రూ. 1,03,000
సూపర్‌వైజర్ స్థాయి : రూ. 27,600 – రూ. 95,910
అసిస్టెంట్ స్థాయి : రూ. 21,540 – రూ. 85,570
జూనియర్ టెక్నిషియన్ : రూ. 18,780 – రూ. 67,390

SPMCIL Jobs | ఎంపిక విధానం :

కంప్యూటర్ ఆధారిత పరీక్ష. కొన్ని పోస్టులకు టైపింగ్ / స్టెనోగ్రఫీ పరీక్ష ఉంటాయి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు చివరి తేదీ: మే 19.
దరఖాస్తు రుసుము :
జనరల్ అభ్యర్థులకురూ. 1000. రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు రూ. 200.

పరీక్ష వివరాలు :
పరీక్ష తేదీ : జూన్ /జూలైలో..

పరీక్ష కేంద్రాలు :
హైదరాబాద్, నాసిక్, చెన్నై, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, భోపాల్, ఇండోర్ .

పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://cnpnashik.spmcil.com లో సంప్రదించండి.

ఇది కూడా చదవండి..: CUET UG 2026 | మే 11 నుంచి CUET-UG పరీక్షలు.. డ్రెస్ కోడ్‌పై NTA కీలక సూచనలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...