CUET UG 2026 | మే 11 నుంచి CUET-UG పరీక్షలు.. డ్రెస్ కోడ్‌పై NTA కీలక సూచనలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CUET UG 2026 | National Testing Agency నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG) 2026 పరీక్షలు మే 11వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. భారత్‌తో పాటు విదేశాల్లోని 15 నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

CUET UG 2026 | మార్గదర్శకాలు..

ఈ సందర్భంగా అభ్యర్థుల కోసం డ్రెస్ కోడ్‌కు సంబంధించిన ఎన్‌టీఏ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. మత విశ్వాసాలకు సంబంధించిన వస్తువులు, ఆభరణాలు ధరించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, అలాంటి వస్తువులు ధరించే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకుని భద్రతా తనిఖీలకు సహకరించాలని కోరింది.

CUET UG 2026 | కలావా

ముఖ్యంగా ‘కలావా’ వంటి మతపరమైన దారాలను ధరించడానికి అనుమతి ఉంటుందని ఎన్​టీఏ తెలిపింది. అలాగే, తెలుపు లేదా లైట్ కలర్ దుస్తులు ధరించడం మంచిదని ఈ సందర్భంగా సూచించింది. చలిని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే వులెన్ దుస్తులు ధరించవచ్చని, అయితే ముందుగానే కేంద్రానికి చేరుకుని ఫ్రిస్కింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పింది.

పరీక్షా కేంద్రాల్లో భద్రతా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అభ్యర్థులు నిబంధనలు పాటించి సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని ఎన్​టీఏ సూచించింది.

Hantavirus WHO Alert | కొవిడ్​ను మించిన వైరస్.. ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *