April 21 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan
April 21 Market Analysis

అక్షరటుడే, వెబ్​డెస్క్​: April 21 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో అనిశ్చితుల నేపథ్యంలో గత సెషన్‌లో ప్రధాన మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. వాల్‌స్ట్రీట్‌తోపాటు, యూరోపియన్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి.. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభాలతో ఉండడంతో మన మార్కెట్ గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

April 21 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

అమెరికా, ఇరాన్ మధ్య శాంతిచర్చలపై అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wallstreet) నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్ 0.26 శాతం, ఎస్ అండ్ పీ 0.24 శాతం నష్టపోయాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.16 శాతం లాభంతో ఉంది.

April 21 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.16 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.13 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.55 శాతం నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8.10 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.11 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.00 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.02 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.45 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.26 శాతం లాభంతో కొనసాగుతుండగా.. చైనాకు చెందిన షాంఘై 0.21 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 0.25 శాతం లాభంతో సాగుతోంది. ఇది మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇస్తోంది.

గమనించాల్సిన అంశాలు..

ఎఫ్ఐఐలు మూడు సెషన్ల తర్వాత నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,059 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.

డీఐఐలు మూడు సెషన్ల తర్వాత నికర కొనుగోలుదారులు అయ్యారు.

గత సెషన్‌లో నికరంగా రూ. 2,966 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.

నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.09 నుంచి 1.13 కు పెరిగింది.

విక్స్ 9.21 శాతం పెరిగి 18.79 వద్ద ఉంది.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95 డాలర్ల వద్ద ఉంది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు బలహీనపడి 93.12 వద్ద ఉంది.

నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: Revanth vs KCR | ఒకే గడ్డ.. ఇద్దరు అగ్రనేతలు.. కరీంనగర్‌లో హీటెక్కిన పొలిటికల్ వార్!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *