April 21 Gold rates | బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. అక్షయ తృతీయ కొనుగోళ్ల తర్వాత మార్కెట్‌లో ఊగిసలాట

Naresh Chandan
April 28 Gold Prices

అక్షరటుడే, వెబ్​డెస్క్​: April 21 Gold rates | గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు Silver Prices ఒక్కసారిగా పడిపోవడం మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్నారు.

ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో బంగారం ధర 1.21% తగ్గి ఔన్సుకు 4,821 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 2.05% పడిపోయి ఔన్సుకు 80.16 డాలర్లకు చేరింది.ఇదే ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపిస్తోంది. ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,280గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,42,340కు చేరగా, 18 క్యారెట్ల బంగారం రూ.1,16,460 వద్ద కొనసాగుతోంది.

April 21 Gold rates | త‌గ్గుతూ వ‌స్తున్న ధ‌ర‌లు..

వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టి 999 శుద్ధి వెండి కిలో ధర రూ.2,74,900 వరకు పడిపోయింది. అయితే ధరలు పెరిగినా, తగ్గినా… అక్షయ తృతీయ సందర్భంగా మాత్రం బంగారం కొనుగోళ్లలో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. సంప్రదాయంగా శుభదినంగా భావించే ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం దుకాణాలు మహిళలతో కిటకిటలాడాయి.

ధరలు అధికంగా ఉన్నప్పటికీ వినియోగదారులు భారీగా కొనుగోళ్లు చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రాంతాల వారీగా ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,55,280గా ఉండగా, ఢిల్లీలో Delhi రూ.1,55,430గా నమోదైంది. ముంబైలో కూడా ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతుండగా, చెన్నైలో కొద్దిగా ఎక్కువగా రూ.1,55,990కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా ఇదే విధంగా నగరానికొకలా స్వల్ప మార్పులతో ట్రేడవుతున్నాయి.

April 21 Gold rates | 

వెండి ధరలు కూడా నగరాలవారీగా భిన్నంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌, చెన్నై, కేరళలో Kerala కిలో వెండి రూ.2,79,900 వద్ద ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రూ.2,74,900కు లభిస్తోంది. గతంలో కిలో వెండి ధర రూ.4 లక్షల వరకు చేరిన నేపథ్యంలో ప్రస్తుతం దాదాపు లక్ష రూపాయలకుపైగా తగ్గిపోవడం గమనార్హం. మొత్తం మీద చూస్తే, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలం, భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. వచ్చే రోజుల్లో ఈ ధరలు మరింత మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Tim Cook Resignation | యాపిల్​ సీఈవో టిమ్ కుక్ తన బాధ్యతలకు గుడ్​బై.. కొత్త సారథిగా జాన్​ టెర్నస్​!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *