అక్షరటుడే వెబ్‌డెస్క్: Attapur Murder Case | రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో అనుమానంతో భార్యను భర్త కిరాతకంగా విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చిన ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ భయంకరమైన ఘాతుకానికి సంబంధించి మృతురాలి కుమారుడు కళ్లారా చూసిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కన్నతండ్రి రాక్షసత్వాన్ని, తల్లి అనుభవించిన నరకాన్ని గుర్తుచేసుకుంటూ ఆ బాలుడు చెప్పిన మాటలు స్థానికులను కన్నీటిపర్యంతం చేశాయి.

Attapur Murder Case | బాలుడి కథనం ప్రకారం..
అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు భార్య కోమలపై ఒక్కసారిగా కత్తితో దాడికి తెగబడ్డాడు. ప్రాణభయంతో కోమల గదిలోంచి బయటకు పారిపోవడానికి ప్రయత్నించింది. అయినా సరే ఆ కిరాతకుడు వదలకుండా ఆమెను వెంబడించాడు. కత్తితో పాటు ఇంట్లోని స్క్రూడ్రైవర్, ఇనుప రాడ్‌ను తీసుకుని ఆమెపై క్రూరంగా దాడి చేసాడు.
Attapur Murder Case | ‘నాన్నా కొట్టకు’ అని వేడుకున్నా..
కళ్ల ముందే కన్నతల్లి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే ఆ బాబు తట్టుకోలేకపోయాడు. తండ్రి కాళ్లు పట్టుకుని, “నాన్నా.. ప్లీజ్ అమ్మను కొట్టకు నాన్నా..” అంటూ అడ్డువెళ్లాడు. కానీ, కళ్లు గప్పేసిన ఆ కిరాతకుడు కొడుకు ఆర్తనాదాలను కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. రాడ్‌తో కోమలను తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో పడివున్న కోమలను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల చేర్చిన కేవలం ఐదు నిమిషాలకే ఆమె ప్రాణాలు విడిచిందని బాలుడు కన్నీరుమున్నీరయ్యాడు. కళ్లముందే తల్లి ప్రాణాలు పోతుంటే కాపాడుకోలేకపోయానంటూ ఆ బాలుడు రోదించిన తీరు ప్రతీ ఒక్కరినీ కదిలించివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

HYD: అత్తాపూర్‌లో భార్య కోమలను భర్త అనుమానంతో కిరాతకంగా చంపిన ఘటనపై వారి కుమారుడు చెప్పిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తితో దాడి చేయగా, భయంతో కోమల పారిపోయిందని తెలిపాడు. అయినా వదలకుండా వెంటాడి స్క్రూడ్రైవర్, రాడ్‌తో దాడి చేశాడని, ‘నాన్నా… pic.twitter.com/sthGgA8oiF
— ChotaNews App (@ChotaNewsApp) June 5, 2026
ఇది కూడా చదవండి: Revanth Reddy Harvard Training | హార్వర్డ్‌లో సీఎం శిక్షణపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు
